Saturday 21 September 2019

నక్కకు బుద్ది చెప్పిన కుందేళ్ళు || The Rabbits and cunning fox Telugu panchatantra stories for kids





నక్కకు బుద్ది చెప్పిన కుందేళ్ళు || The Rabbits and cunning fox Telugu panchatantra stories for kids



నక్కకు బుద్ది చెప్పిన కుందేళ్ళు || The Rabbits and cunning fox Telugu panchatantra stories for kids
#నక్కకుబుద్దిచెప్పినకుందేళ్ళు #telugustories #moralstoriesforkids

************* 63. నక్కకు బుద్ది చెప్పిన కుందేళ్ళు *************
( జాన్, సోనీ చెరో వైపున లాగుతూ తాడు ఆట ఆడుతుంటారు.. అక్కడే ఫాదర్ వుండి ఇద్దరినీ ఎంకరేజ్‌ చేస్తుంటాడు. )
ఫాదర్ వాయిస్ : చిన్న విరామం ... తర్వాత మళ్లీ ఆడుకుందురుగానీ, ఈలోపుగా ఈ ఆటతో కుందేళ్లు నక్కకు ఎలా బుద్ది
చెప్పాయో.. ఓ నీతి కథ చెబుతాను.. వినం డి..
------------------
ఫాదర్ వాయిస్ :
ఒకసారి అడవిలో కుందేళ్ళన్నీ ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి, తినాలని దానికి నోరూరింది. అం దుకు ఓ పధకం ఆలోచించింది. నెమ్మ దిగా వాటి దగ్గరకు చేరి ఇలా అం ది.
" కుందేలు పిల్లలూ ..చాలా ఆనం దం గా వున్నట్టున్నారూ.. "
" అవునవును.. మేం చాలా సం తోషంగా వున్నాము.." అం ది ఓ కుందేలు..
" ఇం తకంటే సం తోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను.. చెప్పమం టారా.." అం ది నక్క.
" ఆ.. చెప్పు..త్వ రగా చెప్పు .." అన్నాయవి.
" ఏం లేదర్రా .. మీ కుందేళ్లకు రాజైన చందమామ ..నేలకు దిగి, ఇక్కడికి ఉత్తరాన వున్న పెద్దకొలనులో ఆడుకుంటున్నాడు.
చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదా వుంటే నాతో రావచ్చు.." అని నక్క అనడం తో .. అమాయకపు కుందేళ్లన్నీ "
నేను..నేను.. నేను ముందు" అం టూ పోటీ పడ్డాయి.
" ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం ..నేనా ముసలిదాన్న యిపోయాను.. అం దర్నీ ఒకే సారి వీపుమీద కూర్చోబెట్టుకుని
వెళ్లలేనుగా.. ఓ పని చేద్దాం .. రోజుకి ఒకరిని తీసుకెళ్తాను.. వాళ్ళు హాయిగా చందమామను దగ్గరనుంచి చూడవచ్చు..
ఆడుకోవచ్చు.. ఆఖరి రోజున వెళ్లిన దారే కనుక అం దరూ కలిసి మీరు తిరిగి వచ్చెద్దురులే .." అని నమ్మ బలికింది.
మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చుని అం దరికీ 'బై..బై..' చెప్పి సం తోషంగా బయలు దేరింది.
అలా నక్క దుర్బుద్దిని గ్రహించని కుందేళ్ళు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతుంటాయి.
ఒకరోజు పిట్ట ఒకటి చెట్టుమీద కూర్చుని నక్క పన్నాగాన్ని పసికడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు
చెబుతుంది.
" అక్కడ చెరువు లేదూ.. చందమామ లేదూ.. ఆ జిత్తులమారి నక్క మిమ్మ ల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది. అది మీ మిత్రులను ఎలా తిన్న దీ నేను కళ్ళారా చూసాను.. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది.." అం దా పిట్ట.
అది విన్న కుందేళ్ళు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ది చెప్పాలనుకున్నాయి.
మర్నాడు నక్క మరో కుందేలును తీసుకునివెళ్ళడానికి వచ్చింది.
" నక్క మామా..నక్క మామా.. వెళ్థాంలేగానీ.. కాసేపు తాడులాగే ఆట ఆడుకుందామా.." అన్నాయి కుందేళ్ళు..
" ఆ ఆట నాకు రాదు కదా "అం ది నక్క..
" ఏం లేదు మామా.. మేమం తా ఒక వైపున పట్టుకుని తాడులాగుతాం.. మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు.. గట్టిగా లాగితే వారే విజేత.. " అనడం తో "ఓస్.. అం తేనా.. అయితే నేనే విజేత.. "అం టూ నక్క ఆనం దం గా ఆటలోకి దిగింది.
కుందేళ్లన్నీ ఒక వైపు, నక్క ఒక్కటీ ఒక వైపు పట్టుకుని తాడుని బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడ బలుక్కుని తాడుని ఒక్కసారిగా వదిలేసాయి. నక్క అదుపుతప్పి వెనుక వున్న బావిలో పడిపోయింది.
జిత్తులమారి నక్క పీడ విరగడవడం తో కుందేళ్ళన్నీ సం తోషించాయి.
అం దుకే అం టారు... " ఎత్తులు వేసే వారు ఒకరుంటే.. వారి పైఎత్తులు వేసే వారు మరొకరు వుంటారనీ.. "


  • RSK Telugu stories
  • నక్కకు బుద్ది చెప్పిన కుందేళ్ళు
  • నక్క
  • కుందేళ్ళు
  • The Rabbits and cunning fox
  • moral stories for kids
  • telugu moral stories for kids
  • stories for kids
  • telugu moral stories
  • fairy tales stories
  • animated video for kids
  • 3D animation
  • 3D
  • animals stories for kids
  • cunning fox
  • here
  • rabbits stories for kids

No comments:

Post a Comment