Friday, 13 September 2019

మెదడులేని గాడిద - సింహం || Foolish lion Telugu Moral story for toddlers || Panchantra stories

మెదడులేని గాడిద - సింహం || Foolish lion Telugu Moral story for toddlers || Panchantra storiesమెదడులేని గాడిద - సింహం || Foolish lion Telugu Moral story for toddlers || Panchantra stories
#మెదడులేనిగాడిదసింహం #foolishlion #moralstoriesforkids

STORY :

7) ************* " మెదడులేని గాడిద- సింహం " *************
(( సోనీ, జాన్, గ్రాండ్‌మా బెడ్ పై వుంటారు. ))
జాన్ వాయిస్: నాకోసం ఇం కో క థ చెప్ప వా గ్రాండ్‌మా..!
గ్రాండ్‌మా వాయిస్ : ఏరా నిద్ర రావ టం లేదా!?
సోనీ వాయిస్: అవును..! రేపు హాలిడే క దా.. లేటుగా లేవ చ్చు..!
గ్రాండ్‌మా వాయిస్ : స రే, అయితే.. ! ఇం త కు ముందు క థ లో సింహాన్ని కుందేలు బురిడీ కొట్టిస్తే .. ఈ క థ లో
సింహాన్ని, గాడిద నూ ఓ న క్క మోసం చేసింది.. !
జాన్ వాయిస్: అమ్మో నక్క ..! జిత్తుల మారినది.. గ్రాండ్‌మా ఆ కథ త్వ ర గా చెప్ప వా... !
----------------------------
గ్రాండ్‌మా వాయిస్ : అనగనగా ఒక అడవికి ఓ మృ గరాజు వుండేది. అది ముస లిది అయిపోవ డం తో వేటాడ లేని ప రిస్దితి..
ఇలాంటి వృ ద్ధ వయసులోనే ఎవరికైనా వింత కోరికలు కలుగుతాయి అం టారు. అలాగే సింహానికీ ఓ వింత కోరిక పుట్టింది.
ఆ కోరిక ఏంటం టే.. మంచి రుచిక ర మైన గాడిద మెద డు తినాల నీ..
వెంట నే బలం కూడగట్టుకుని గట్టిగా సింహం గాండ్రించ డం తో క్షణాల్లో మం త్రి నక్క సింహం ముందు వాలిపోయింది.
త న మెద డులో పుట్టిన 'గాడిద మెద డు' తినాల నే ఆలోచ న ను నక్క కు వివ రించింది సింహం. అది విని త ట పటాయిస్తున్న
న క్క తో..
" మం త్రీ నీ తెలివితేటలు నీకు తెలియనివి కావు.. మా కోరిక తీర్చ డం కేవలం మీ వలనే సాధ్యపడుతుంది."
అం టూ నక్క ని తెగపొగిడేసింది. ఆ మాటలకు రెచ్చిపోయిన నక్క ఎలాగైనా సరే ఈరోజు తన బాస్ కి గాడిదను గిఫ్ట్ గా ఇవ్వాలనుకుని బలం గా నిర్ణయించుకుని వెతకటం ప్రారం భించింది.
అలా వెతకగా వెతకగా నక్క కి ఓ చోట గడ్డిమేస్తూ గాడిద కనిపించింది. అక్క డికి మూలుగుతూ దీనం గా నడుచుకుంటూ వెళ్ళింది
నక్క .
అది చూసి గాడిద "ఏమైంది నక్క బావా అలా మూలుగుతున్నావ్.." అం ది "ఏం చెప్పమం టావ్.. నేనా ముసలిదాన్న యిపోయాను. ఇప్పుడు ఈ అడవికి కొత్త మం త్రిని వెతకే బాథ్య త కూడా నామీదే పెట్టారు
మృ గరాజావారు.. ఆలోచించగా ఠక్కున నీవు గుర్తొచ్చావ్.. అం దుకే వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను.. మం త్రి పదవి నీకు
ఇష్టమేకదా."
ఆ మాటలకు గాడిద ఆలోచనలో పడింది..
అది గమనించిన నక్క చిన్న డ్రామా ఆడింది.
"స రేలే నీకు ఇష్టం లేన ట్లుందీ.. మం త్రి ప ద వి వ రిస్తుంటే వ ద్ద నే దాన్ని నిన్నే చూస్తున్నాను. ఏదో తెలిసిన దానివీ.. పైగా మెద డు క ల దానివీ.. తెలివిగా నిర్ణ యం తీసుకుంటావ నుకుంటే.. ఆలోచిస్తున్నావ్.. నీకు ఆ అదృ ష్టం లేన ట్లుందీ.. వేరొక రిని వెతుక్కుని రాజా వారి వద్దకు తీసుకెళ్తలే.. నీవు నెమ్మ దిగా ఆ గడ్డి తిను.." అని వెటకారం చేసి.. వెళ్ళాబోతుంటే..
"నక్క బావా ఆగు.. ఒకేసారి పెద్ద మం త్రి పదవి అనే సరికి భయం వేసింది. అం తేకానీ, నీ మాటను ఏనాడైనా కాదని
అన్నానా.. అయినా, పెద్ద పెద్ద బరువైన మూటలు మోసే నాకు ఆ మం త్రి పదవి మోయడం పెద్ద కష్టం కాదుగా.. నీతో మృ గరాజు దగ్గరకు నేనూ వస్తాను.పదా.."
అలా గాడిద తనను పూర్తిగా నమ్మి, తనతో రావడం తో నక్క కి భలే సం తోషం వేసింది.
ఇద్దరూ నడుస్తూ సింహం వుండే చోటుకి చేరుకున్నారు.
అప్పటికే సింహం ఆతృ తగా ఎదురుచూస్తుంది.
"రాజా..మీ కొత్త మం త్రిగారు వ చ్చారు" అని నక్క అనగానే..
సింహం ఒక్క ఉదుటన గాడిదపైకి దూకి తన పంజా విసిరి చంపేస్తుంది.
మరో ఆలోచన లేకుండా గాడిద తలను పగులగొడుతుంది.
అప్పటికే గాడిద మెదడును తను ఎలాగైనా కాజేయాలని కాచుకుని కూర్చున్న నక్క ఇలా అం ది.
"మృ గరాజా..కాస్త ఓపిక పట్టం డి.. దాన్ని చంపడం తో మీ శరీరానికి మరకలు అం టాయి. ఏదైనా భుజించే ముందు శుభ్రత పాటించడం రాజాచారం . ప్రక్క నే నది వుంది. వెళ్ళి స్నానం చేసిరం డి. అప్పటి వరకూ ఇక్క డ నేను కాపలాగా వుంటాను."
అది నిజమేనని నమ్మిన సింహం నది వద్దకు వెళుతుంది.
అదే అదనుగా భావించిన జిత్తులమారి నక్క వేగంగా గాడిద మెదడును కాజేస్తుంది. నదిలో స్నానం చేసి సింహం వచ్చే సమయానికి బుద్దిమం తురాలిలా నటిస్తుంది.
సింహం ఎంత వెతికినా గాడిద మెదడు కనపడదు.
అదే విష య మై నక్క ను ఆరా తీస్తుందీ..
త న కేం తెలీదంటుంది న క్క ..
"పోనీ నువ్వు తిన్నావా.. ఏం అనుకోనులే ..నిజం చెప్పు మిత్ర మా.. "అం టూ సింహం నిజం చెప్పించే ప్ర య త్నం చేస్తుంది..
"అయ్యయ్యో! నేను అం త ధైర్యం చేయగలనా.. అయినా నా విశ్వాసం ఏపాటిదో మీకు తెలియనిదా..! "అం త కు త గిన స మాధాన మిస్తుంది నక్క .
"అదీ నిజమే.. నీవు నన్ను మోసం చేసేదానివే అయితే, ఈ గాడిదను నా దగ్గరకు ఎందుకు తీసుకువస్తావు." అని సం తృప్తి ప డుతుంది సింహం..
త నకు త న పూర్వీకులు చెప్పిన విష యమొ క టి గుర్తొచ్చిందం టూ న క్క ఇలా అంటుంది.
"గాడిద బుద్ది హీనమైన జంతువు.. బుద్ది హీనమైన జంతువులకు మెదడు వుండదట.."
వెంట నే సింహం.."నేనూ అదే అనుకున్నాను... ఈ గాడిదకు మెదడు ఉండి వుంటే నా దగ్గరకు ఎందుకు వచ్చేది! "
అని పడీ పడీ నవ్వుకుంటూ మిగిలినది తింటుంది..
గాడిదకు మెదడు లేదం టే నమ్మేసిన.. అసలు మెదడులేని సింహాన్ని చూసి నక్క లోలోపలే నవ్వుకుంది.
ఈ క థ లో నీతేమిటం టే.. " చిన్న ఆలోచన తో పెద్ద స మస్య నుండి కూడా బ య టప డొచ్చు."


 • RSK Telugu stories
 • మెదడులేని గాడిద- సింహం
 • మెదడులేని గాడిద
 • మెదడులేని సింహం
 • Foolish lion
 • telugu moral story
 • for kids
 • telugu stories for kids
 • telugu stories
 • fairy tales stories
 • telugu moral stories
 • panchantra stories for kids
 • kids stories
 • bedtime stories
 • for toddlers
 • kids funny stories in telugu
 • telugu fairy tales

Thursday, 12 September 2019

రెండు నక్కల కథ || Rendu Nakkala Katha Telugu Moral Story For Childrens || Telugu Stories Collection

రెండు నక్కల కథ || Rendu Nakkala Katha Telugu Moral Story For Childrens || Telugu Stories Collection

రెండు నక్కల కథ || Rendu Nakkala Katha Telugu Moral Story For Childrens || Telugu Stories Collection
#రెండునక్కలకథ #telugustories #rendunakkalakatha
 • RSK Telugu stories
 • రెండు నక్కల కథ
 • telugu moral stories
 • rendu nakkala katha
 • stories for kids
 • panchatantra kathalu
 • fairy tales stories
 • bedtime stories for kids
 • telugu stories
 • rendu nakkalu
 • కథ
 • తెలుగు కథలు
 • రెండు నక్కలు
 • animals stories
 • story for kids
 • video for kids

Wednesday, 11 September 2019

ఆవు - పులి నీతి క‌థ‌ ## || Cow And Tiger Telugu Moral Story For Childrens || Panchatantra Kathalu

ఆవు - పులి నీతి క‌థ‌ ## || Cow And Tiger Telugu Moral Story For Childrens || Panchatantra Kathaluఆవు - పులి నీతి క‌థ‌## || Cow And Tiger Telugu Moral Story For Childrens || Panchatantra Kathalu
#ఆవు-పులినీతిక‌థ‌ #telugumoralstories #panchatantrakathalu

 • RSK Telugu stories
 • ఆవు - పులి నీతి క‌థ‌
 • telugu moral stories
 • aavu puli katha
 • నీతి క‌థ‌
 • video for kids
 • telugu stories
 • ఆవు
 • పులి
 • fairy tales stories
 • telugu
 • cow and tiger story in telugu
 • animated video for kids
 • storytime for kids
 • నీతి
 • క‌థ‌
 • moral story
 • telugu story

Tuesday, 10 September 2019

బావిలో కప్ప లు నీతి కథ || Bavilo kappalu telugu moral stories for kids || Panchatantra

బావిలో కప్ప లు నీతి కథ || Bavilo kappalu telugu moral stories for kids || Panchatantraబావిలో కప్ప లు నీతి కథ || Bavilo kappalu telugu moral stories for kids || Panchatantra

#బావిలోకప్ప లు #Telugustories #storiesforkids

*********** " బావిలో కప్ప లు" ***********

( పిల్లలు ఇద్దరూ వాళ్ల మిత్రుల ఇంటికి వెళ్లి ఆడుకోవాలని నిర్ణయించుకుంటారు. వంట చేస్తున్న మదర్ దగ్గరకు వచ్చి ఈ విషయం చెబుతారు. )

జాన్ వాయిస్: మమ్మీ .. నేనూ, సోనీ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి సాయింత్రం వరకూ ఆడుకుని వస్తాం..

మదర్ వాయిస్: అమ్మో .. మీరు ఇద్దరూ ఒం టరిగా వెళతారా.. వద్దు .. మీరు చిన్న పిల్లలు.. డాడీ రాగానే

వెళుదురుగానీ..

సోనీ వాయిస్: ఫరవాలేదు మమ్మీ .. ఏం కాదులే..

మదర్ వాయిస్: ఇంకేం చెప్పొద్దు.. వెళ్లి , గార్డెన్‌లో ఆడుకోండి..

( చేసేది లేక పిల్లలు ఇద్దరూ మమ్మీ దగ్గర నుంచి వెళ్లిపోతారు. )

జాన్ వాయిస్: మమ్మీ ఎప్పుడూ అలాగే అంటుంది.. ఎవరికీ చెప్పకుండా మనం వెళ్లిపోదాం..

సోనీ వాయిస్: ఎలా వెళ్ళడం ..

జాన్ వాయిస్: గోడ దూకి నెమ్మ దిగా వెళదాం..

(అని గోడ దగ్గరకు వెళ్లి దూకే ప్రయత్నం చేస్తుండగా , గ్రాండ్ ఫాదర్‌కి దొరికి పోతారు. )

గ్రాండ్ ఫాదర్‌ వాయిస్: మమ్మీ వద్దని చెప్పినా.. మీరు ఇలా చేయడం తప్పు కాదర్రా.. పెద్దవాళ్లు లేకుండా చిన్న పిల్లలు బయటకు వెళితే ఎన్ని కష్టాలు పడవలసివస్తుందో తెలుసా.. మీలానే కప్ప లు ఓసారి బావిలోంచి బయటకు దూకి ఏం చేసాయో చెబుతాను వినం డి...

----------------------------

గ్రాండ్ ఫాదర్‌ వాయిస్:

అనగనగా ఒక ఊరిలో ఒక పురాత న బావి వుండేది. అది ఎప్ప టిదో కావ డం తో ఎవ రూ వాడ క కప్ప లు స్ధిర నివాసాన్ని ఏర్పాటుచేసుకుని జీవిస్తూ వుండేవి. ఎప్పుడూ క ప్ప ల బెక బెకలతో ఆ బావి ధ్వనిస్తూ వుండేది.

ఒక రోజు పిల్ల కప్ప లు, తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగాయి.

" ఎప్పుడూ ఈ బావిలోనే వుంటున్నాము క దా అమ్మా..బోర్ కొడుతుంది.. ఈ ఒక్క రోజూ బ య టతిరిగి వ స్తాం.. ప్ర పం చం ఎలా వుంటుందో చూసివ స్తాం.."

తల్లి కప్ప వెంటనే “బ య ట కు వెళితే తప్పి పోతారు. నాకు మిమ్మ ల్ని వెతకటం కష్టం అవుతుంది.” అం ది.

అయినా ,పిల్ల కప్ప లు పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలాయి. చివరికి విసుకు చెంది తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ బావి దాటలేదు. మీరూ నా మాట వినం డి” అని వెళ్ళిపోతుంది.

పిల్ల కప్ప లు చాలా మొండివి. . “అనుమతి అడిగితే ఇలాగే వుంటుంది. అమ్మ ఊరికే విసుక్కుంటుంది. అస లు అమ్మ కే తెలియ కుండా ఈ బావిని దాటేయాలి" అని గ ట్టిగా నిర్ణ యించుకున్నాయి. అలా వాళ్ళ అమ్మ నిద్రిస్తున్న స మ యం చూసి..

నెమ్మ దిగా అం చులకు చేరుకుని గ బుక్కున బ య ట కు దూకేస్తాయి. ఎప్పుడూ బావి దాటి బ య ట కు రాని పిల్ల కప్ప లు బ య ట ప్ర పం చాన్ని చూసి ఆశ్చ ర్య పోతాయి.

ఎదురుగా క నిపించిన ఏనుగును చూసి మొద ట జ డుసుకుని..త ర్వాత , క న్నార్పకుం డా చూస్తూ వుండిపోతాయి.

" అమ్మో ..ఇదేంటీ ఇంత పెద్దగా వుంది. "

" చూడ టానికి మన రెండు క ళ్లూ చాల డం లేదు.."

" ఇది వుండటా నికి మ న బావికూడా సరి పోదు.."

" దీని పేరేమిటో ..?"

అలా రెండు క ప్ప లు చర్చిం చుకుని..ఆ విష యం వాళ్ళ అమ్మ తో చెప్పాల ని వేగంగా బావిలోకి గెంతుతాయి.

కంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్తాయి.

మొద ట అవి త నకు చెప్ప కుండా బ య ట కు వెళ్ళినం దుకు కోపం తెచ్చుకున్నా ..తర్వా త , తల్లి కప్ప కూడా ఏనాడూ ఎవ రిని

చూడలేదుగా, అం దుకే ఆతృ త గా “ఎం త లావుందీ?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వుందా?”అం ది.

“ఊహూ” అని అడ్డం గా తల ఊపింది ఒక పిల్ల కప్ప .

“ఇంత?” అని ఇంకా పొంగించింది తల్లి.

“ఊహూ” అని అం టూ అడ్డం గా తల ఊపింది మ రో పిల్ల కప్ప .

“ఇంత? పోనీ ఇంతా? ఇదిగో చూడు, ఇంతా?” అం టూ పొట్ట వుబ్బించి, వుబ్బించి, పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప .

అం దుకే అం టారు.. " అజ్ఞానం , మూర్ఖ త్వం కష్టాలు కొని తెస్తాయ ని.."

-------------------------

సోనీ వాయిస్: అవును ఆ కప్ప ల మూర్ఖత్వం కారణం గా వాటి మదర్ కూడా దూరమైంది..

జాన్ వాయిస్: ఇకమీదట పెద్దవాళ్ళు చెప్పిం ది వింటాము..

గ్రాండ్ ఫాదర్‌ వాయిస్: అదీ బుద్దిమం తుల లక్షణం


 • RSK telugu stories
 • బావిలో కప్ప లు
 • telugu kathalu
 • bavilo kappalu telugu moral story
 • 3d
 • telugu stories
 • stories for kids
 • నీతి కథ
 • panchatantra kathalu
 • fairy tales stories
 • stories
 • teluguSunday, 8 September 2019

పొట్టేళ్ళ మూర్ఖత్వం || Proud goats Telugu moral stories collection for children

పొట్టేళ్ళ మూర్ఖత్వం || Proud goats Telugu moral stories collection for childrenపొట్టేళ్ళ మూర్ఖత్వం || Proud goats Telugu moral stories collection for children

#పొట్టేళ్ళమూర్ఖత్వం #telugustories #moralstories

9) ************ " పొట్టేళ్ళ మూర్ఖత్వం " **************
(( జాన్ ఒక toyతో ఆడుకుంటుంటాడు. అక్క డికి సోనీ వ స్తుంది. ఆ toy తీసుకుని త ను ఆడుకుంటుంది. తర్వా త మ ళ్ళీ జాన్ లాక్కుని దాంతో ఆడుకోవ డం .. అలా ఇద్ద రూ ఒకే toy కోసం పోట్లాడుకుంటుంటారు. అది డాడీ చూసి అక్క డ కు
రావ డం .. ))
డాడీ వాయిస్: అరెరే..! ఎందుకు పోట్లాడుకుంటున్నారు...?! అస లేం జరిగిందీ...?
జాన్ వాయిస్: ఆ toy నాకు కావాలీ... !
సోనీ వాయిస్: ఊహో..!నాకు కావాలీ..నేనాడుకుంటాను.. !
(( ఇద్ద రూ వాదులాడుకోవ డం ..))
డాడీ వాయిస్: అం దుకా మీరు పోట్లాడుకునేదీ..! పంతం తో మీరిద్ద రూ ఇలా పోట్లాడుకున్నార నుకో..ఆ toy
మీకు చెందకుం డా పాడైపోతుందీ.. పైగా ఇద్ద రికీ దెబ్బ లు కూడా త గులుతాయి. అలా పంతం ప ట్టి పోట్లాడుకున్న ఓ రెండు పొట్టేళ్ళకు చివరి కి ఏం జ రిగిందో .. ఈ క థ ద్వారా తెలుసుకోండి.. !
డాడీ వాయిస్: ఒకానొక అడవిలో ఓ నది వుంది. ఆ నదిపై ఇటునుంచి అటువైపునకు వెళ్ళాల న్నా, అటునుంచి ఇటువైపున కు రావాల న్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డం గా వేయబడివుంది. అదే ఆ నదిపై వం తెన అన్న మాట. వం తెన సన్న గా, ఇరుకుగా
వుంది.
అయితే ఓ రోజు రెండు గొర్రె పొట్టేళ్ళు ఎవరి దారిన వారు వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి. వం తెన ప్రారం భంలోనే అవి ఒకదానిని ఒకటి చూసుకున్నా..పట్టించుకోకుండా.. గొర్రె పొట్టేళ్ళు ఒకటే సారి వం తెన మీదకి అడుగు పెట్టాయి.
అదే సమయంలో కాలవలో నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి.
అహంభావం తో ఆ రెండింటిలో ఏ ఒక్క దానికీ వెనుకడుగు వేయడం ఇష్టం లేదు. గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకి సాగుతూ కాస్సేపటికి వం తెన మధ్యలో అవి కలుసుకున్నాయి.
" నీ పేరేమిటో నాకు తెలియదు..ముందు నేనే ఈ వం తెనపైకి వచ్చాను.. వెనక్కి నడువు.." అం ది మొద టి పొట్టేలు..
" నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు..ముందుగా వం తెనపైకి నేను వచ్చాను.. వెనక్కి వెళితే నీకే మంచిది.."
అం ది అం తే గ ట్టిగా రెండో పొట్టేలు..
" నేను ఈ ప్రక్కనున్న పొట్టేళ్ళ నాయకుడిని.. నన్ను గెలవలేవు.." అని ఒక టి అం టే..
" ఆ ప్రక్కనున్న పొట్టేళ్ళకు నేనే రాజుని..నాకు ఓటమి తెలియదు.." అం ది రెండోది.
రెండింటికీ మ ధ్య కోపంతో మాటా మాటా పెరిగింది..
"రా..చూసుకుందాం.. రారా... తేల్చుకుందాం..."
అం టూ రెండూ గర్వం తో ఘర్షణ పడ్డాయి.
రెండు పొట్టేళ్ళుకొమ్ములు విరిగేలా ఢీ కొంటున్నాయి. భీకరం గా పోరు సాగింది.
మూర్ఖం గా తల పడటం వల్ల.. రెండూ ఒక్క సారిగా అదుపుత ప్పి నదిలో పడి, వేగంగా వ స్తున్న ఆ నీటి ప్ర వాహానికి కొట్టుకు
పోయాయి.
ఈ క థలో నీతి ఏమిటం టే.. " కొన్ని సం దర్బా ల లో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనుకడుగు వేయడమే
మం చిది.."
----------------------
డాడీ వాయిస్: చూసారా.. ఆ పొట్టేళ్ళు రెండూ కూడా పంతం విడువ క పోట్లాడుకోవడం తో ఎంత న ష్టం
జ రిగిందో.. !
సోనీ వాయిస్: మేము వాటిల్లా పోట్లాడుకోము.. brother ఈ toyతో నీవు ఆడుకో.. !
జాన్ వాయిస్: లేదు sister,, ముందు నీవు ఆడుకో ..ఆ త ర్వాత నేను ఆడుకుంటాలే.. !
(( అది చూసి డాడీ హ్యాపీ..))


 • RSK Telugu stories
 • పొట్టేళ్ళ మూర్ఖత్వం
 • telugu stories
 • moral stories
 • panchatantra kathalu
 • pedarasi peddamma kathalu
 • telugu moral stories
 • telugu stories for kids
 • telugu kathalu
 • telugu
 • stories for kids in telugu
 • telugu kathalu for children
 • moral stories in telugu
 • పొట్టేళ్ళు
 • క థ
 • Proud goats Telugu moral stories
 • Proud goats
 • goats stories
 • stories in telugu