Tuesday 10 September 2019

బావిలో కప్ప లు నీతి కథ || Bavilo kappalu telugu moral stories for kids || Panchatantra





బావిలో కప్ప లు నీతి కథ || Bavilo kappalu telugu moral stories for kids || Panchatantra



బావిలో కప్ప లు నీతి కథ || Bavilo kappalu telugu moral stories for kids || Panchatantra

#బావిలోకప్ప లు #Telugustories #storiesforkids

*********** " బావిలో కప్ప లు" ***********

( పిల్లలు ఇద్దరూ వాళ్ల మిత్రుల ఇంటికి వెళ్లి ఆడుకోవాలని నిర్ణయించుకుంటారు. వంట చేస్తున్న మదర్ దగ్గరకు వచ్చి ఈ విషయం చెబుతారు. )

జాన్ వాయిస్: మమ్మీ .. నేనూ, సోనీ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి సాయింత్రం వరకూ ఆడుకుని వస్తాం..

మదర్ వాయిస్: అమ్మో .. మీరు ఇద్దరూ ఒం టరిగా వెళతారా.. వద్దు .. మీరు చిన్న పిల్లలు.. డాడీ రాగానే

వెళుదురుగానీ..

సోనీ వాయిస్: ఫరవాలేదు మమ్మీ .. ఏం కాదులే..

మదర్ వాయిస్: ఇంకేం చెప్పొద్దు.. వెళ్లి , గార్డెన్‌లో ఆడుకోండి..

( చేసేది లేక పిల్లలు ఇద్దరూ మమ్మీ దగ్గర నుంచి వెళ్లిపోతారు. )

జాన్ వాయిస్: మమ్మీ ఎప్పుడూ అలాగే అంటుంది.. ఎవరికీ చెప్పకుండా మనం వెళ్లిపోదాం..

సోనీ వాయిస్: ఎలా వెళ్ళడం ..

జాన్ వాయిస్: గోడ దూకి నెమ్మ దిగా వెళదాం..

(అని గోడ దగ్గరకు వెళ్లి దూకే ప్రయత్నం చేస్తుండగా , గ్రాండ్ ఫాదర్‌కి దొరికి పోతారు. )

గ్రాండ్ ఫాదర్‌ వాయిస్: మమ్మీ వద్దని చెప్పినా.. మీరు ఇలా చేయడం తప్పు కాదర్రా.. పెద్దవాళ్లు లేకుండా చిన్న పిల్లలు బయటకు వెళితే ఎన్ని కష్టాలు పడవలసివస్తుందో తెలుసా.. మీలానే కప్ప లు ఓసారి బావిలోంచి బయటకు దూకి ఏం చేసాయో చెబుతాను వినం డి...

----------------------------

గ్రాండ్ ఫాదర్‌ వాయిస్:

అనగనగా ఒక ఊరిలో ఒక పురాత న బావి వుండేది. అది ఎప్ప టిదో కావ డం తో ఎవ రూ వాడ క కప్ప లు స్ధిర నివాసాన్ని ఏర్పాటుచేసుకుని జీవిస్తూ వుండేవి. ఎప్పుడూ క ప్ప ల బెక బెకలతో ఆ బావి ధ్వనిస్తూ వుండేది.

ఒక రోజు పిల్ల కప్ప లు, తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగాయి.

" ఎప్పుడూ ఈ బావిలోనే వుంటున్నాము క దా అమ్మా..బోర్ కొడుతుంది.. ఈ ఒక్క రోజూ బ య టతిరిగి వ స్తాం.. ప్ర పం చం ఎలా వుంటుందో చూసివ స్తాం.."

తల్లి కప్ప వెంటనే “బ య ట కు వెళితే తప్పి పోతారు. నాకు మిమ్మ ల్ని వెతకటం కష్టం అవుతుంది.” అం ది.

అయినా ,పిల్ల కప్ప లు పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలాయి. చివరికి విసుకు చెంది తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ బావి దాటలేదు. మీరూ నా మాట వినం డి” అని వెళ్ళిపోతుంది.

పిల్ల కప్ప లు చాలా మొండివి. . “అనుమతి అడిగితే ఇలాగే వుంటుంది. అమ్మ ఊరికే విసుక్కుంటుంది. అస లు అమ్మ కే తెలియ కుండా ఈ బావిని దాటేయాలి" అని గ ట్టిగా నిర్ణ యించుకున్నాయి. అలా వాళ్ళ అమ్మ నిద్రిస్తున్న స మ యం చూసి..

నెమ్మ దిగా అం చులకు చేరుకుని గ బుక్కున బ య ట కు దూకేస్తాయి. ఎప్పుడూ బావి దాటి బ య ట కు రాని పిల్ల కప్ప లు బ య ట ప్ర పం చాన్ని చూసి ఆశ్చ ర్య పోతాయి.

ఎదురుగా క నిపించిన ఏనుగును చూసి మొద ట జ డుసుకుని..త ర్వాత , క న్నార్పకుం డా చూస్తూ వుండిపోతాయి.

" అమ్మో ..ఇదేంటీ ఇంత పెద్దగా వుంది. "

" చూడ టానికి మన రెండు క ళ్లూ చాల డం లేదు.."

" ఇది వుండటా నికి మ న బావికూడా సరి పోదు.."

" దీని పేరేమిటో ..?"

అలా రెండు క ప్ప లు చర్చిం చుకుని..ఆ విష యం వాళ్ళ అమ్మ తో చెప్పాల ని వేగంగా బావిలోకి గెంతుతాయి.

కంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్తాయి.

మొద ట అవి త నకు చెప్ప కుండా బ య ట కు వెళ్ళినం దుకు కోపం తెచ్చుకున్నా ..తర్వా త , తల్లి కప్ప కూడా ఏనాడూ ఎవ రిని

చూడలేదుగా, అం దుకే ఆతృ త గా “ఎం త లావుందీ?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వుందా?”అం ది.

“ఊహూ” అని అడ్డం గా తల ఊపింది ఒక పిల్ల కప్ప .

“ఇంత?” అని ఇంకా పొంగించింది తల్లి.

“ఊహూ” అని అం టూ అడ్డం గా తల ఊపింది మ రో పిల్ల కప్ప .

“ఇంత? పోనీ ఇంతా? ఇదిగో చూడు, ఇంతా?” అం టూ పొట్ట వుబ్బించి, వుబ్బించి, పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప .

అం దుకే అం టారు.. " అజ్ఞానం , మూర్ఖ త్వం కష్టాలు కొని తెస్తాయ ని.."

-------------------------

సోనీ వాయిస్: అవును ఆ కప్ప ల మూర్ఖత్వం కారణం గా వాటి మదర్ కూడా దూరమైంది..

జాన్ వాయిస్: ఇకమీదట పెద్దవాళ్ళు చెప్పిం ది వింటాము..

గ్రాండ్ ఫాదర్‌ వాయిస్: అదీ బుద్దిమం తుల లక్షణం


  • RSK telugu stories
  • బావిలో కప్ప లు
  • telugu kathalu
  • bavilo kappalu telugu moral story
  • 3d
  • telugu stories
  • stories for kids
  • నీతి కథ
  • panchatantra kathalu
  • fairy tales stories
  • stories
  • telugu











No comments:

Post a Comment