Monday 23 September 2019

కుందేలుకు గుణపాఠం కథ || Lesson to Rabbit Telugu Story for kids | Panchatantra stories for children's





కుందేలుకు గుణపాఠం కథ || Lesson to Rabbit Telugu Story for kids | Panchatantra stories for children's



కుందేలుకు గుణపాఠం కథ || Lesson to Rabbit Telugu Story for kids | Panchatantra stories for children's
#కుందేలుకుగుణపాఠంకథ #telugumoralstoires #forkids

************* కుందేలుకు గుణపాఠం కథ.. ******************

ఒక అడవిలో ఒక అం దమైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది.
" నేను చాలా అదృష్టవంతురాలిని .. నాతో అం దరూ చాలా మంచిగా వుంటున్నారు.. నాకు వున్నం త మం ది స్నేహితులు వేరే ఎవరికీ లేరు.. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు. " అని ఎంతో గర్వ పడేది.
ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేటకుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరుగెత్తింది.
‘‘మిత్రమా.. మిత్రమా! కొన్ని వేటకుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి’’ అం ది కుందేలు.
‘‘నిజమే! నీవు చెప్పిన పనిని నేను సునాయాసం గా చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే. కొమ్ములు ఖాళీగా లేవు .. ఎలుగుబం టిని అడుగు’’ అని చెప్పిం ది దుప్పి.
వేట కుక్కలు వస్తుండటం తో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. ‘‘నేస్తమా..నేస్తమా ..! నువ్వు అం దరిలోకి బలశాలివి. కొన్ని వేటకుక్కలు నా వెంటబడ్డాయి. వాటిని నీ తొండం తో ఒక్కటి ఇచ్చి నన్ను కాపాడు’’ అని
ప్రాధేయపడింది.
‘‘నన్ను క్షమించు. నేనిప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఆహారం వెతుక్కోవాలి.
నీకు ఇప్పుడు సహాయం చేయలేను’’ అం టూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు.
కుందేలు వేటకుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది.. ‘‘అమ్మో నేనా? ఆ కుక్కలు ఇటుగానీ వచ్చాయంటే , నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను రాను’’ అం టూ ఒక్క ఉదుటన చెట్టుపైకి ఎగిరి కూర్చుంది కోతి.
ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేటకుక్కల బారినుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది.
కాసేపటికి వేటకుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనేం వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది.
ఆ సం ఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అం తేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది.
ఈ కథలో నీతి.." అన్నిం టికీ ఇతరుల మీద ఆధారపడకూడదు..మన శక్తిని మనం గుర్తించాలి."


  • RSK Telugu stories
  • నీతి కధ
  • కుందేలుకు గుణపాఠం కథ
  • కుందేలు
  • కథ
  • Panchatantra stories
  • stories for kids
  • telugu moral stories
  • fairy tales stories
  • telugu moral stories for kids
  • stories in telugu
  • kids stories
  • elephant
  • deer
  • animals stories
  • for kids
  • తెలుగు కథలు
  • bedtime stories
  • telugu stories for kids
  • moral stories
  • telugu fairy tales
  • moral stories for kids
  • kathalu
  • good stories
  • moral
  • animation stories

No comments:

Post a Comment