Monday, 30 September 2019

గాడిదకు బుద్ది చెప్పిన కోతి || The monkey who whispered to the donkey Telugu moral stories for kids

గాడిదకు బుద్ది చెప్పిన కోతి || The monkey who whispered to the donkey Telugu moral stories for kidsగాడిదకు బుద్ది చెప్పిన కోతి || The monkey who whispered to the donkey Telugu moral stories for kids

#గాడిదకుబుద్దిచెప్పినకోతి #telugumoralstory #moralstoriesforkids

************** గాడిదకు బుద్ది చెప్పిన కోతి *****************
( గ్రాండ్
ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది.. అది బాగా బద్దకస్తురాలు.. దాంతో ఎవరూ ఆ గాడదతో స్నేహం చేసేవారు కాదు.. అది ఏమాత్రం పనీపాటా లేక ఊరికే దగ్గరలో వున్న అడవిలో తిరుగుతూ ఉండేది.
ఆ గాడిద ఎప్పుడు ఖాళీగా తిరుగుతూ వుండటం చూసిన చిన్న చిన్న పిట్టలు..
“అం త పెద్దగా ఉన్నావు. బం డెడు తింటావు. బుద్దేమి లేదురా గాడిదా..’’ అం టూ ఆటపట్టిస్తూ ఉంటే సరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ది పెంచుకోవాలని నిర్ణయించుకుంది.
ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళ్తుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది. దానితో ‘‘ఎద్దన్నా ఎద్దన్నా.. తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే చెప్పవా? ’’ అని అడిగింది.
”అబ్బో! బం డి కట్టడం , కాడి ఎత్తడం , మెరక దున్న డం .. నాకు చాలా పని ఉన్న ది. నన్ను వదిలేయ్యి” అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు.
సరేలే అనుకుని అటుపక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద..
" గజరాజా..గజరాజా.. తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే కాస్త చెప్తావా?"
" నేను ఏనుగుల నాయకుడను.. నా వాళ్లంతా చెరువు ఎండి..త్రాగడానికి నీరులేక అలమటిస్తున్నారు..ముందుగా వారికి ఓపెద్ద చెరువు వెతికి వాళ్ళను అటుగా నడిపించాలి.. ఇప్పుడు నాకు తీరికలేదు..తరువాత కలువు.." అనేసి వేగంగా వెళ్ళిపోతుంది
గజరాజు.
తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో ‘‘చీమ చెల్లి.. చీమ చెల్లి.. నాకు బుద్దంటే ఏమిటో చెప్పవా?’’ అం ది ఆ
గాడిద..
‘‘ఏమీ అనుకోవద్దు గాడిదన్నా.. వానాకాలం వస్తే నాకు తినడానికి ఏం వుండదు.. అం దుకే ఇలా పరిగెడుతున్నా. ఖాళీ ఉన్న ప్పుడైతే చెపుతా ..ఏమీ అనుకోవద్దూ..’’ అం టూ వెళ్ళిపోయింది.
ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి. కానీ గాడిదకు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.
ఆఖరికి విసిగి విసిగి ఓ చెట్టుక్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పిం ది. ‘‘బుద్ది కోసం రోడ్డున పడి తిరగాల్సిన అవసరం లేదు. బుద్ది మంతులు అం దరూ ఎవరు పని వారు చేసుకుంటారు. నీ పని నీవు చేసుకో చాలు.’’
అనడం తో గాడిదకు నిజం గా బుద్ది వచ్చింది.
అప్పటినుంచి తన పని తాను చేసుకుంటూ, మూటలు మోయడం లో యజమానికి సహాయపడుతూ.. ఎవరితోనూ ఎవరితోనూ మాటపడకుండా
హాయిగా జీవించింది.
అం దుకే అం టారు.. "ఎవరి పని వారు చేసేకోవడమే వివేక వంతుల లక్షణం అనీ.. "


 • RSK Telugu stories
 • గాడిదకు బుద్ది చెప్పిన కోతి
 • The monkey who whispered to the donkey
 • గాడిద
 • కోతి
 • Telugu moral stories
 • for kids
 • monkey
 • funny monkey
 • Elephant
 • crow
 • ant
 • animals stories for kids
 • kids
 • bedtime stories
 • donkey
 • monkey story
 • donkey story
 • stories for kids
 • telugu moral stories
 • fairy tales stories
 • lazy donkeySaturday, 28 September 2019

తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ || A ducks who does not listen to his mother Telugu stores for kids

తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ || A ducks who does not listen to his mother Telugu stores for kidsతల్లి మాటలు వినని బాతుపిల్ల కథ || A ducks who does not listen to his mother Telugu stores for kids
#తల్లిమాటలువిననిబాతుపిల్లకథ #telugumoralstories #forkids

************ తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ *********************
మదర్ వాయిస్‌ :
ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజూ తల్లితో పాటు నదిలో సరాదాగా విహరించేవి..
ఒక్కో సారి తల్లికి దూరం గా వెళ్లిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సం తోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్లేటపుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది.
" చూడం డి పిల్లలూ.. మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు.. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచివుంటుందో మనకు
తెలియదు... అం దుకే అన్ని వేళలా చాలా అప్రమత్తం గా వుండాలి..మన శతృవులతో స్నేహం చేయవద్దు.. నీటి ప్రవాహం ఎక్కువుగా వున్న వైపుకు వెళ్ళకూడదు.. సరేనా... !"
"ఓ .. సరే.. " అం టూ ఆ బాతు పిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమం గా తిరిగి వస్తుండేవి.
ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకసారే ఈదడం మొదలుపెట్టాయి.
ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వ రగా చేరుకోవాలనే ఆత్రుతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకి వెళ్లింది.
‘‘ నీరు వేగంగా వెళ్లేచోట ఈదకూడదు. నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి. ’’ అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది.
కాసేపు ఆలోచించి ‘‘నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా! ప్రమాదం ఏమీ ఉండదులే!’’ అనుకుంది ఆ బాతుపిల్ల.
అం దుకే అటుగా వెళ్ళింది.. కానీ, అం తలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు
కొట్టుకుపోసాగింది.
బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పినమాట వినకపోవడం వల్లే ఇం త పెద్ద ప్రమాదం లో పడ్డానని బాధ పడింది. ఇం కో బాతుపిల్ల దానిని
గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్స హాయంగా చూస్తూ ఉండిపోయింది.
అదృష్టవశాత్తూ, అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు.. అతను వెంటనే పడవను అటుగా పోనిచ్చి , బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అలా బాతుపిల్ల ప్రమాదం నుండి బయటపడింది. బాతుపిల్లలు రెండూ జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి.
పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధ పడింది. వాటిని ఓదార్చిం ది..
ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వ కంగా తెలుసుకున్న ఆ బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం
మొదలుపెట్టింది.
ఈ కథలో నీతి ఏమిటంటే.." పిల్లలు పెద్దలమాటను తప్పకుండా ఆచరించాలి."


 • RSK Telugu stories
 • తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ
 • A ducks who does not listen to his mother
 • బాతుపిల్ల కథ
 • బాతు
 • కథ
 • ducks
 • duck
 • for kids
 • kids moral stories
 • moral
 • telugu
 • panchatantra stories
 • stories for kids
 • telugu moral stories
 • fairy tales stories
 • bedtime moral stories
 • bedtime panchatantra stories
 • bedtime stories
 • moral story for kidsFriday, 27 September 2019

మూడు ఆవుల కథ || Three Cows Telugu moral story for kids || Panchatantra Stories for children's

మూడు ఆవుల కథ || Three Cows Telugu moral story for kids || Panchatantra Stories for children'sమూడు ఆవుల కథ || Three Cows Telugu moral story for kids || Panchatantra Stories for children's
#మూడుఆవులకథ #ThreeCowsTelugumoralstory #moralstoriesforkids

************* మూడు ఆవుల కథ ...*******************
( సోనీ, జాన్ విడివిడిగా చదువుకుంటుంటారు. ఫాదర్ వస్తాడు.. ఇద్దరి మధ్య ఏదో జరిగిందని గ్రహిస్తాడు. )
ఫాదర్ వాయిస్‌ : ఎందుకలా దూరం దూరం గా వున్నారు..
సోనీ వాయిస్‌ : వాడికీ నాకూ గొడవ అయింది..
జాన్ వాయిస్ : నేను సోనీతో మాట్లాడను..
ఫాదర్ వాయిస్‌ : ఓహ్..! ఇలా విడిపోతే ఎంత నష్టమో తెలుసా... మొదట చాలా ఐకమత్యం గా వుండి తర్వాత చిన్న చిన్న అపార్దాలతో విడిపోయిన మూడు ఆవుల కథ చెబుతాను ..వినం డీ..
------------------
ఫాదర్ వాయిస్‌ :
అనగనగా ఒక ఊరిలో మూడు ఆవులు కలిసి మెలసి జీవిస్తూ ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడూ కలిసే వెళ్ళేవి. దగ్గరలో వున్న అడవికి మేతకు వెళ్లినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి. ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి.
వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి.
ఇం తలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరం గా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది.
" ఆహా! ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి
తీర్చుకుంటాను" అని సింహం ఆశగా అనుకుంది.
ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూసాయి.
వెంటనే అం దులో ఒక ఆవు భయపడుతూ ఇలా అం ది..." అమ్మో , సింహం .. అది గాండ్రిస్తోంది. ఇప్పుడు ఏం చేయడం .."
అం దులో ఒక ఆవు ఏమాత్రం భయపడకుండా ఇలా అం ది..
"మిత్రులారా.. మీరు భయపడద్దు. మనం దరం ఐకమత్యం గా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చెయ్యలేదు. నేను చెప్పినట్లు చెయ్యం డి.
ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం.. దానిని తరిమికొడదాం"
అని చెప్పిం ది.
ఆ మూడో ఆవు. "నీఆలోచన బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే చేద్దం " అనగానే అన్నీ ఒకే నిర్ణయానికి వచ్చాయి.
అం తే, సింహం తమ మీద దూకేలోపునే మూడు ఆవులు కలిసి సింహం మీద దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని
పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది. ఆ విధం గా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి.
అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు. అం దుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగినదం తా చెప్పి ,
ఐకమత్యం గా వున్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్య త నక్కకు అప్పగించింది.
వెంటనే నక్క విడివిడిగా వున్న ప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కోరకంగా చాడీలు చెప్పసాగింది.
వెంటనే నక్క విడివిడిగా వున్న ప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కోరకంగా చాడీలు చెప్పసాగింది.
" ఆ రోజు మీరం తా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదల చాటుగా నిలబడి చూస్తూనే వున్నాను.. నీ కొమ్ముల వాడితనం ఉందే.. అబ్బో, నిజం గా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికి రాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదే ఆ సింహం.. నేను నీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్క రిస్తున్నాను.. అం తా బాగానే ఉంది కానీ,
నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివిలాంటి వాడివి.
కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చిపెట్టాలి. అం తేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదే.
అదే నాకు బాధగా ఉంది" అం టూ మొదటి ఆవుతో చెప్పిం ది. నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది.
ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లిన జిత్తులమారి నక్క అదే విషయం అం దరికీ చెప్పిం ది. దాంతో మూడు ఆవులు మిగతావాటి కన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అలా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం
మొదలుపెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదైయింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం
దెబ్బ తింది. ఇదివరకులా అవి కలిసి మెలసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్ళడం లేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు.
తను అనుకున్న ది జరిగినం దుకు సింహం ఆనం దించింది. వాటిని అం త త్వ రగా విడగొట్టినం దుకు నక్కను అభినం దించింది.
ఇం కే ముంది అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టుపెట్టింది సింహం. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారి తీసింది.
అం దుకే మన పెద్దవారు చెప్పేది.. " ఐకమత్యమే మహాబలం అని.. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి
వస్తుంది."


 • RSK Telugu stories
 • Three Cows Telugu moral story
 • మూడు ఆవుల కథ
 • Telugu moral stories for kids
 • కథ
 • మూడు ఆవుల
 • moral stories in Telugu
 • stories for kids
 • telugu moral stories
 • fairy tales stories
 • telugu fairy tales
 • telugu kathalu
 • panchatantra kathalu
 • moral stories in telugu
 • telugu fairy tales for kids
 • kids Stories
 • bedtime stories

Thursday, 26 September 2019

కోతి చేష్టలు నీతి కథ || monkey antics Telugu moral story for kids || RSK telugu Stories

కోతి చేష్టలు నీతి కథ || monkey antics Telugu moral story for kids || RSK telugu Storiesకోతి చేష్టలు నీతి కథ || monkey antics Telugu moral story for kids || RSK telugu Stories

#కోతిచేష్టలునీతికథ #monkeyanticsmoralstory #telugumoralstories

************* కోతి చేష్టలు నీతి కథ *************
( జాన్‌, సోనీ, వాళ్ళ ఫ్రెండ్‌ ఆడుకుంటూ వుంటారు.. ఇం తలో ఫ్రెండ్‌ స్లైడర్ పైనుంచి దూకబోతాడు.)
సోనీ వాయిస్ : వద్దు.. అక్కడి నుండి దూకొద్దు.. డేంజర్..
ఫ్రెండ్ వాయిస్ : నాకేం కాదు.. నాకు భయం లేదు..
(అని ఫ్రెండ్ దూకేస్తాడు.. కాలు నొప్పి పుట్టి లేవలేకపోతాడు.. అక్కడికి ఫాదర్‌ వస్తాడు.. )
జాన్‌ వాయిస్ : మా మాట వినలేదు డాడీ..
(వాళ్ళ ఫ్రెండ్ లెగ్ సెట్ చేస్తాడు ఫాదర్‌.. )
ఫాదర్‌ వాయిస్‌ : చిన్న దెబ్బే , ఫరవాలేదు... నీవు ఎదుటివారు చెప్పిన మంచి మాట వినలేదనుకో , ఆ మూర్ఖపు కోతిలా కాలు విరగ్గొట్టుకుంటావ్.. తప్పని సరిగా ఆ కథ నీవు తెలుసుకోవాలి...
-----------------------
ఫాదర్‌ వాయిస్‌ :
అనగనగా ఒక అడవి.. ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడి నుండో వచ్చింది. అవి అక్కడ చెట్లపై కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ మరొక చోటుకి సాగిపోయాయి. ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ వుంది. అది అలా అక్కడా ఇక్కడా గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడివున్న గొడ్డలి ఒకటి కనిపించింది.
అది కట్టెలు కొట్టేవాడు భోజన విరామ సమయంలో వదిలి వెళ్ళిన గొడ్డలి.
వెళ్ళి దానిని చేతిలోకి తీసుకుని "హాయ్.. భలే..భలే... దీనితో చెట్లు నరకడం చాలా సార్లు చూసాను.. నేనూ ఒక చెట్టును దీనితో పడగొడతాను.." అనుకుంది.
గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టుమీదకి గెంతింది. ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మ ను నరుకుతూ
వుంది.
అటుగా వెళ్తున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మ నే నరుక్కుంటున్న కోతిని చూసింది.
" కోతి మిత్రమా.. నీవు కూర్చున్న కొమ్మ నే నరుక్కుంటున్నావ్.. క్రింద పడిపోతావ్.. నరకొద్దు .." అని హెచ్చరించింది
" నీ బోడి సలహా నాకేం అవసరం లేదు.. ఫో" అని తలతిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారం భించింది కోతి.
అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండటం తో ఏనుగు చాలా రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేసింది...
దాంతో ఆగ్రహించిన ఆ కోతి "నేను నా బలాన్ని ప్రదర్శిస్తున్నం దుకు నీకు అసూయ" అని తన దగ్గరలో చెట్టుకొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కేసి కొట్టింది. పండు బలంగా తగలడం తో ఏనుగు మొహం పచ్చడి అయింది.
అప్పుడు అర్థం అయింది ఆ ఏనుగుకు.. 'ఆ కోతిది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం అనీ.'. ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగుతీస్తుంది.
ఆ తర్వాత కొమ్మ ను పూర్తిగా నరకడం తో అది విగిరి కోతి క్రింద పడింది. మిత్రుడి మాట వినక పోవడం వల్ల కాలు విరిగిన కోతి లబోదిబోమని ఏడ్చిం ది.
అం దుకే అం టారు.. "మూర్ఖులతో వాదనకు దిగకూడదనీ..."


 • RSK Telugu stories
 • కోతి చేష్టలు నీతి కథ
 • monkey antics Telugu moral story
 • for kids
 • కోతి చేష్టలు
 • నీతి కథ
 • కథ
 • తెలుగు కథలు
 • stories for kids
 • telugu moral stories
 • fairy tales stories
 • monkey
 • Elephant
 • forest animals
 • for toddlers
 • bed time stories for kids
 • panchatantra stories
 • telugu
 • moral
 • stories
 • kids
 • bedtime moral stories
 • bedtime

Tuesday, 24 September 2019

నక్క విపరీత ఆలోచన ||The fox bizarre thought Telugu moral story for kids || Panchatantra Stories

నక్క విపరీత ఆలోచన ||The fox bizarre thought Telugu moral story for kids || Panchatantra Storiesనక్క విపరీత ఆలోచన ||The fox bizarre thought Telugu moral story for kids || Panchatantra Stories
#నక్క విపరీత ఆలోచన #Thefoxbizarrethought #telugumoralstories


************** నక్క విపరీత ఆలోచన ************
( జాన్ డల్ గా కూర్చుని వుంటాడు. అక్కడకు మదర్‌ వస్తుంది. )
మదర్ వాయిస్ : జాన్ , ఎందుకు డల్‌గా వున్నావు..
జాన్ వాయిస్ : నా ఫ్రెండ్ తప్పు చేసాడు మమ్మీ.. వాడిని సేవ్‌ చేద్దామని టీచర్‌కు అబద్దం చెప్పాను.. ఫైనల్‌గా నిజం తెలిసిపోయి ఇద్దరినీ కొట్టారు..
మదర్ వాయిస్ : వాడేం తప్పు చేసాడు..
జాన్ వాయిస్ : వేరే వాడి బుక్‌లో పిచ్చి గీతలు గీసాడు..
మదర్ వాయిస్ : మరి అలాంటి వాడికి సపోర్ట్‌ చేయడం తప్పు కదా... నీలాగే పాపం ఓ కప్ప తన మిత్రుడైన నక్కకు సహాయం చేయబోయి చేతులు కాల్చుకుంది.. ఆ కథ చెబుతాను. . విను..
--------------------
మదర్ వాయిస్ :
ఒక అడవిలో పులి, నక్క చాలా కలిసి మెలిసి వుండేవి. ముందుగా అడవిలో నక్క సం చరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను
కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అం దివ్వగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్దావరానికి తెచ్చుకుని రెండూ సమం గా పంచుకుని తినేవి.
ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ది పుట్టింది.
" నేను కొండలు, గుట్టలు తిరిగి .. చాలా కష్టపడి జంతువుల సం చారం పసిగట్టి చెబితే, ఆ బద్దకపు పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోందీ.. కానీ, వాస్తవంగా దక్కాల్సిం ది.. నాకు రెండు భాగాలూ, దానికి ఒక భాగం ..! ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే, అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు.. ! ఈ సమస్య సామరస్యం గా పరిష్కారం కావాలంటే ఎలా ..?" అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది.
ఉన్న ఫళంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది.. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది.. తనూ, పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరుపెట్టి బాధ పడింది.. తన సాయాన్నిఅర్దించింది..
దీని వల్ల ఎలాంటి అనర్ధం జరుగుతుందోనని భయంగా వున్నా.. మిత్రుడు అడగటం తో కప్ప అయిష్టంగానే 'సరే' అని
ఒప్పుకుంది. కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క.
ఎప్పటిలానే ఆ రోజు కూడా పులి,నక్కలు, ఆహారాన్ని చెట్టుక్రిందనున్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలెట్టాయి ...ఇం తలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క.. దానికి ససేమిరా అం ది
పులి.. రెండింటి మధ్యా మాటా మాటా పెరిగింది..
" మనలో మనకి తగవెందుకు? నాకు రెండు భాగాలు రావడం న్యాయమోకాదో వృక్షదేవతను అడుగుదాం.. . వృక్షదేవతా! మా
తగవు నీవే తీర్చాలి. అం దుకు నువ్వే తగినదానవు..ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి " అం ది నక్క.
చెట్టు తొర్రలో నుండి 'పులికి ఒక భాగము, నక్కకు రెండు భాగములు చెందుట సమం జసం ' అని వినిపించింది.
అప్పుడు ఆ పులి కోపంతో "దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది" అం టూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి
నిప్పంటించింది. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెక మం టూ బాధగా అరుస్తూ బయటకు వచ్చి "మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం." అని చెప్పి.. జిత్తులమారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినం దుకు తనను తాను నిందించుకుని అక్కడినుండి పరుగుతీసింది.
అం దుకే అం టారు... " కుటిలబుద్దికి తానేకాక తనవారు కూడా బలవుతారనీ.. "


 • RSK Telugu stories
 • నక్క విపరీత ఆలోచన
 • |The fox bizarre thought
 • he fox bizarre thought Telugu moral story
 • నక్క
 • telugu moral story
 • for kids
 • kids stories
 • bedtime stories
 • moral stories in Telugu
 • stories for kids
 • telugu moral stories
 • fairy tales stories
 • kids
 • moral
 • stories
 • cunning fox
 • tiger
 • deer
 • forest animals
 • animals stories for kids
 • frog