Tuesday 15 October 2019

సోమరి గాడిద కథ || Lazy Donkey Telugu moral stories for kids toddlers || Panchatantra stories





సోమరి గాడిద కథ || Lazy Donkey Telugu moral stories for kids toddlers || Panchatantra stories



సోమరి గాడిద కథ || Lazy Donkey Telugu moral stories for kids toddlers || Panchatantra stories

సోమరి గాడిద కథ

ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. తన గ్రామం లో ప్రతీ కొట్టుకు తిరుగుతూ అతను ఉప్పు విక్రయించేవాడు.
రానురానూ అక్కడ వ్యాపారం లాభసాటిగా సాగకపోయేసరికి ..
"ఈ ఊరిలో ఉప్పు వ్యాపారం పెద్దగా సాగడం లేదు. చాలా నష్టాలు వస్తున్నాయి..అదే పట్టణానికి తీసుకుని వెళ్లి అక్కడ పెద్ద బజారులో అమ్మితే మంచి లాభాలు వస్తాయి..పైగా వ్యాపారాన్ని విస్తరించినట్టూ వుంటుంది.. " అని నిర్ణయించుకున్నాడు
కానీ , ఉప్పు మూటలు పట్టణానికి తీసుకుని వెళ్ళేం దుకు ఆ వ్యాపారికి ఒక గాడిద అవసరం అనిపించింది. వెంటనే పట్టణం వెళ్లి సం తలో అమ్ముతున్న ఒక గాడిదను కొన్నాడు.
ప్రతిరోజూ తన గాడిదపై ఉప్పు మూటలు పెట్టి పట్టణానికి తీసికెళ్లి అమ్ముకొని వచ్చేవాడు.
అయితే.. వ్యాపారి ఊరికి, పట్టణానికి మధ్య లో ఒక కాలువ ఉంది. ప్రతీసారీ ఆ కాలువపై వున్న చిన్న పాటి వంతెనను
దాటవలసివుంటుంది.
ఒక రోజు ఉప్పుమూటలతో కాలువ దాటుతున్న గాడిదకి కాలుకి ఏదో అడ్డుపడి పడిపోయింది.
వెంటనే ఉప్పుమూటలు నీటిలో పడి పూర్తిగా తడిచిపోయాయి. ఉప్పు అం తా కరిగిపోయింది. ఇక గాడిదకు మోసే భారం తప్పిం ది.
దాంతో గాడిద చాలా సం తోషించింది.
యజమాని బాధపడినా, ఇది అనుకోకుండా జరిగింది కనుక ఏమీ మాట్లాడకుండా మౌనం గానే వుండిపోయాడు.
ఆ సం ఘటనతో గాడిదకు ఓ ఆలోచన తట్టింది. " రోజూ యజమాని నాతో చాలా బరువులు మోయిస్తున్నాడు. ఇలా చేస్తే ఉప్పు అం తా కరిగిపోయి, నాకు మోసే భారం తప్పుతుంది. " అనుకుంది..
గాడిద ఇకపై ప్రతిరోజూ అదే పని చేయసాగింది. అనుకోకుండా గాడిద పడిపోవడం .. ఉప్పుమూటలు నీటిలోకి దొర్లిపోవడం .. ఉప్పు అం తా కరిగిపోవడం ..
మొదట్లో పోనీలే పాపం అని భావించిన వ్యాపారికి, తర్వాత ఒకనాడు సం దేహం వచ్చి గమనించాడు.. గాడిద కావాలనే నాటకం ఆడుతున్న విషయాన్ని పసిగట్టాడు..
బాగా ఆలోచించి ఎలాగైనా గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు.
ఒక రోజు ఉప్పు మూటలకు బదులు పత్తిమూటలు పెట్టాడు. గాడిద రోజూ చేసే విధం గానే మూటలు కాలువలో పడేసింది.
పత్తిమూటలు పూర్తిగా తడిచి బరువు ఎక్కువ అయ్యాయి. ఆ మూటలను తీసి వ్యాపారి గాడిద మీద పెట్టి మోయించాడు. ఆ మూటలు మోయలేక గాడిద బాధపడింది. ఇకపై ఎప్పుడూ యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది.
ఆ తర్వాత రోజు నుండి గాడిద మూటలను కాలువలో పడేయకుండా పట్టణానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్లేది. అతనికి కూడా ఉప్పు వ్యాపారం బాగా జరిగి చాలా లాభాలను అర్జించిపెట్టింది..
తన వ్యాపారోన్న తికి కారణమైన గాడిదను మంచిగా చూసుకునేవాడు ఆ యజమాని..
ఈ కథలో నీతి ఏమిటంటే.. "అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు."


  • RSK Telugu stories
  • Telugu Stories
  • సోమరి గాడిద కథ
  • గాడిద కథ
  • సోమరి గాడిద
  • stories for kids
  • fairy tales stories
  • telugu moral stories
  • Lazy donkey telugu story
  • moral stories in telugu
  • telugu moral stories for kids
  • kid stories
  • lazy ass
  • lazy donkey for kids
  • panchatantra stories
  • telugu stories for kids
  • panchatantra
  • stories in telugu
  • telugu fairy tales
  • bedtime stories telugu
  • panchatantra kathalu
  • telugu bedtime stories
  • moral stories
  • fairy tales

1 comment:

  1. Casino and Hotels - Mapyro
    Compare and find the best Casino and 대전광역 출장안마 Hotels near you 화성 출장안마 in The casino is 제천 출장샵 located at the intersection of East Hollywood Blvd and S in 제주도 출장샵 Las 경기도 출장샵 Vegas, Nevada

    ReplyDelete