Saturday, 5 October 2019

నక్కకు బుద్ది చెప్పిన కోడి || Chicken And The Fox Telugu moral story for kids | Panchatantra Stories

నక్కకు బుద్ది చెప్పిన కోడి || Chicken And The Fox Telugu moral story for kids | Panchatantra Storiesనక్కకు బుద్ది చెప్పిన కోడి || Chicken And The Fox Telugu moral story for kids | Panchatantra Stories
#నక్కకుబుద్దిచెప్పినకోడి #telugustories #moralstoriesforkids

************ నక్కకు బుద్ది చెప్పిన కోడి *******************

గ్రాండ్ మదర్ వాయిస్ :
ఒకానొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సం తోషంగా జీవిస్తూ వుండేది. తల్లీ, పిల్లలూ అం తా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో వున్న పొదల దగ్గర సం చరించి, సాయింత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేవి..
వీటి కదలికలను గమనించిన ఓ నక్క "కోడి కూనలు భలేగా వున్నాయి.. వీటిని తింటే చాలా రుచిగా వుంటుంది.. అన్నీ ఒకేమారు కాకుండా రోజుకో దాని పని పట్టాలి... ఇం క నాకు చాలా రోజుల వరకూ ఆహారం కొరతే వుండదు.. " అనుకుని సం బరపడి , ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటు వేసి రోజుకో కోడిపిల్లను ఎత్తుకుపోయి తినేది..
మొదట ఇది గమనించని తల్లికోడి..ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడం తో పిల్లలను ఓ మారు లెక్కించ్చింది. అం దులో కొన్ని పిల్లలు కనిపించకపోవడం తో అయోమయంలో పడిపోయింది. .
" నా కూనలు కొన్ని కనిపించడం లేదు .. ఏమయ్యాయి...? .పోరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా..?! లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా..అయినా , నేను ఇం తకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను?! " అనుకుని విపరీతం గా బాధపడింది.
ఆ రోజం తా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటం టూ లేదు. ఎక్కడా వాటి జాడ కనిపించలేదు.
రాత్రి పడుకుంది కానీ, తల్లికోడికి విచారం తో నిద్రపట్టలేదు. సరిగ్గా అదే సమయంలో బిందె దొర్లిన అలికిడి అవడం తో అటుగా
చూసింది.. నక్క ఓ కోడిపిల్లని ఎత్తుకుపోతుండటం గమనించింది..
పాపం, అదిచూసిన తల్లికోడికి పట్టరాని కోపం, దుఃఖం ఒకేసారి కలిగాయి.. కానీ , తను నిస్స హాయురాలు..
ఆ జిత్తులమారి నక్కకి తగిన బుద్దిచెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రం తా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి, ఓ నిర్ణయానికి వచ్చింది..
తెల్లారగానే, చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సం పాదించింది.. దాన్ని ఓ బిందెలో వుంచింది.
ఎప్పటిలానే నక్క ఆ రాత్రికూడా వచ్చింది.. దానికి ముందుగా ఘమఘమల వాసన రావడం తో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు
చూసింది. బిందెలో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది..
" ఆహా! ఇవాళేదో నా పంట పండినట్టుంది.. ముందు చాలా రుచికరమైన దీన్ని తింటానూ, తర్వాత ఓ కోడి పిల్లను ఎత్తుకు పోయి రేపు అల్పాహారం గా తింటాను.." అనుకుంటూ చాలా సం బరపడి.. తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది..
కానీ , నక్క దురదృష్టం కొద్దీ దాని తల అం దులోకి దూరదు.. అం దులో వున్న మాంసం నోటికీ అం దదు..
" ఎందుకిలా అయిందీ...! నేను ఈ మాంసాన్ని విడిచిపెట్టే ప్రశక్తే లేదు... ఎలాగైనా సాధించి తీరుతాను.. " అని బిందెలోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది.
ఇదం తా చాటుగా తల్లీ, పిల్లకోడులు చూస్తుంటాయి.
ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క, తర్వాత తల బైటకు రాక నానా తం టాలు పడింది..
కొద్ది రోజులలోనే ఆహారం తినడానికీ, నీళ్ళు తాగడానికీ లేక నక్క చనిపోయింది.
తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సం తోషంగా గడిపింది...
అం దుకే పెద్దలు చెబుతారు.. " ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారనీ.. "


 • RSK Telugu stories
 • నక్కకు బుద్ది చెప్పిన కోడి
 • Chicken And The Fox
 • Telugu moral story for kids
 • Panchatantra Stories
 • నక్క
 • కోడి
 • Chicken
 • Fox
 • cunning fox
 • moral story
 • fox story
 • moral stories in telugu
 • stories for kids
 • fairy tales stories
 • telugu moral stories
 • panchatantra stories
 • stories

No comments:

Post a comment