Tuesday 15 October 2019

చీమ- పావురం నీతి కథ || Ant and Dove Telugu moral stories for kids || Panchatantra kathalu for kids





చీమ- పావురం నీతి కథ || Ant and Dove Telugu moral stories for kids || Panchatantra kathalu for kids



చీమ- పావురం నీతి కథ || Ant and Dove Telugu moral stories for kids || Panchatantra kathalu for kids

#చీమపావురంనీతికథ #AntandDoveTelugustory #bedtimestoriesforkids

చీమ- పావురం నీతి కథ :
అనగనగా ఒక అడవి... ఆ అడవిలో నది... ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు ... ఆ చెట్టుమీద పావురం ఒకటి
నివశిస్తూవుండేది. అది రోజూ ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఆహారం కోసం అడవంతా తిరిగి, ఎంతో కొంత సం పాదించుకున్నాకా,
మళ్ళీ సాయింకాలం కాగానే గూటికి చేరుకుని.. తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది.
అలా రోజులు గడుస్తుండగా ..ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ వున్న పావురానికి, క్రిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకు పోతూ చీమ ఒకటి కనిపించింది. ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడటానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అది చూసి చలించిపోయింది పావురం .. ఇక దానికి తిండి తినాలనిపించలేదు. దాన్ని ఎలాగయినా కాపాడాలనుకొంది. ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది.
ఆ మర్రిచెట్టు ఆకు నొకదానిని తీసుకొని వెళ్ళి చీమ పక్కన పడేసింది.
'ఓ చీమా, ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో ' అని అరిచింది. అం తే, వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్ళిపోయింది.
ఆకు అలా తేలుతూ నెమ్మ ది నెమ్మ దిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడం తో చీమ సురక్షితం గా ఒడ్డుకు చేరిపోయింది.
'నా ప్రాణాలు కాపాడినం దుకు ధన్య వాదములు' అం టూ పావురానికి చీమ కృతఙ్ఞతలు చెప్పిం ది..." ఏదో ఒక రోజు నీకు సహాయం చేసి నీ రుణం తీర్చుకుంటాను..' అం ది చీమ..
ఆ మాటలు వినగానే పావురం ఫక్కున నవ్వేసింది.
" చీమా ..! నీవు చాలా చిన్న జీవివి...చూశావా.. ! నేను సమయానికి నిన్ను చూడకపోయుంటే ఏమయ్యోదో ..?! నేను నేలమీద నడవగలను, నీటిలో ఈదగలను, ఆకాశం లో ఎగరగలను.. నీవు నాకెలా సహాయపడగలవు చెప్పు.. " అం ది పావురం
నవ్వుకుంటూ..
అయినా తన ప్రాణం కాపాడిన పావురం తో చీమ చెలిమి కోరింది. ఆ చెట్టుక్రిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది.
అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను పక్షులకోసం నాలుగు వైపుల గాలించసాగాడు..
చెట్టు కొమ్మ పై కూర్చుని తినడం లో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూసాడు. అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది.
ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కు పెట్టి పావురానికి గురి పెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాణ్ణి కుట్టింది. బాధతో వేటగాడు " అమ్మా.. అమ్మా.. " అం టూ గట్టిగా అరిచాడు. బాణం గురి తప్పిం ది. వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది.
ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టుమీదకి తిరిగి వచ్చి "చీమా! నీవు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను ..క్షమించు.. ఈ రోజున నీవు లేకపోతే నా ప్రాణమే లేదు.. ఇక నుంచి మనం ప్రాణ మిత్రులుగా ఉందాం" అం ది.
పావురం తన స్నేహితుడైనం దుకు చీమ చాలా సం తోషించింది.
అం దుకే పెద్దలు అం టారు .. “నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరనీ..”


  • RSK Telugu stories
  • Telugu Stories
  • Ant and Dove Telugu moral stories
  • చీమ- పావురం నీతి కథ
  • చీమ
  • పావురం
  • నీతి కథ
  • Ant and Dove
  • Telugu moral stories for kids
  • kids stories
  • moral stories in telugu
  • పావురం నీతి కథ
  • stories for kids
  • fairy tales stories
  • telugu moral stories
  • telugu stories
  • telugu kathalu
  • kids funny stories in telugu
  • telugu fairy tales
  • telugu bedtime stories
  • fairy tales
  • moral stories
  • telugu fairy tales for kids
  • telugu neethi kathalu

No comments:

Post a Comment