Friday 11 October 2019

పులితోలు కప్పుకున్న గాడిద కథ || The Donkey in the Tiger Skin Telugu Panchatantra Kathalu For Kids





పులితోలు కప్పుకున్న గాడిద కథ || The Donkey in the Tiger Skin Telugu Panchatantra Kathalu For Kids



పులితోలు కప్పుకున్న గాడిద కథ || The Donkey in the Tiger Skin Telugu Panchatantra Kathalu For Kids

#పులితోలుకప్పుకున్నగాడిద #TheDonkeyintheTigerSkin #telugumoralstories
************* పులితోలు కప్పుకున్న గాడిద కథ *************

పూర్వం ఒక గ్రామం లో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని వద్ద ఓ గాడిద వుండేది. అయితే, అది పని దగ్గరకు వచ్చే సరికి ఏదో ఒక సాకు చూపి, బట్టలు మోయకుండా యజమానిని రోజూ మోసం చేసేది.. అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదను మేపడం భారం గా మారడం తో దాన్ని వదిలించుకుంటాడు.
ఇం తకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడం తో హాయిగా కాలం వెళ్ళదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి.
దాంతో మేతకోసం పంట పొలాల్లోకి వెళ్ళింది. పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే కాపలావాళ్లు కోపంతో దాన్ని పరుగెత్తించి కొట్లారు.
కొంతకాలం నీళ్ళుతాగి కడుపునింపుకున్న గాడిదకు ఓ నాడు అడవి గుండా వెళ్తుంటే పులితోలు కనిపించింది.. దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్లింది. ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది.
అదేంటంటే... పులితోలును కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది.
పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లో కాపలాదారులు ... "అయ్యబాబోయ్.. పులి... పులి వచ్చింది.. " అని భయపడి పరుగులు తీసారు. దాంతో ఆ గాడిద చేలల్లో తనకు ఇష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్న ది.
ఆ సం ఘటన తర్వాత భయంతో "ఆ పులిని ఏం చేయగలం" అం టూ గ్రామస్తులు ఊరకుండిపోవడం తో, గాడిదకు ఆకలి అనిపించిన ప్రతీసారీ చేలల్లో ఇష్టానుసారం గా తిరిగేది.
అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్య శాలి ఒకడు ఈ పులి సం గతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.
ఎవ్వరికీ తెలియకుండా పొలాల దగ్గర చాటుగా మాటు వేసాడు. కొంత సమయానికి అక్కడకు వచ్చిన గాడిద.. పులితోలు ముసుగులో చేలల్లో పడి, పైరుల్ని మేయసాగింది. పులి ఠీవీని చూడగానే ఆ ధైర్య శాలి వెన్నులో ఒకింత వణుకుపుట్టింది. అయినా సమయం కోసం వేచిచూడసాగాడు.
ఇం తలో వున్నట్టుండి దూరం గా గాడిదలు ఓం డ్రబెట్టాయి. చాలా రోజులుగా మౌనం గా మేత మేయటం అలవాటయిన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడటం తో సం తోషం పట్టలేక పోయింది.
వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా ఓం డ్రపెట్టింది.
తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ఆ ధైర్య శాలికి అది నోరుతెరచి ఓం డ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తనవద్దవున్న దుడ్డుకర్రతో ఆ గాడిదకు బడితెపూజ చేశాడు.
ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పిం ది.
అం దుకే పెద్దలు ఏమం టారంటే...." నిజాన్ని ఎంతోకాలం దాచలేము అనీ. "


  • RSK Telugu stories
  • Telugu Stories
  • పులితోలు కప్పుకున్న గాడిద కథ
  • The Donkey in the Tiger Skin
  • Telugu Panchatantra Kathalu
  • గాడిద
  • పులితోలు
  • The Donkey
  • Tiger
  • Panchatantra Kathalu
  • For Kids
  • kids stories
  • stories for kids
  • moral stories for kids
  • telugu
  • moral
  • stories
  • animal stories
  • Panchatantra
  • bedtime stories
  • stories for childrens
  • for toddlers

No comments:

Post a Comment