Saturday 5 October 2019

చిన్న చీమ- పెద్ద ఏనుగు నీతి కథ || Small Ant and Big Elephant Telugu moral Stories for kids toddlers





చిన్న చీమ- పెద్ద ఏనుగు నీతి కథ || Small Ant and Big Elephant Telugu moral Stories for kids toddlers



చిన్న చీమ- పెద్ద ఏనుగు నీతి కథ || Small Ant and Big Elephant Telugu moral Stories for kids toddlers
#చిన్నచీమపెద్దఏనుగునీతికథ #Telugumoralstories #moralstories

*************** చిన్న చీమ- పెద్ద ఏనుగు నీతి కథ..**********************

ఒక చీమ తన కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది.
ఆ చీమ ఏనుగు ముందు నిల్చుని పెద్దగా అరుస్తూ ..
" ఓయ్‌ ఏనుగూ .. నా మాట విను.. నేనూ, నా కుటుంబ సభ్యులం నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించు. నీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు..... ఆ అభ్యంతరాలు సరైనవో కావో మేము చర్చించుకుంటాం...సరేనా?" అం ది.
తను ఎదురాగా ఓ చీమ వుందనీ, అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ వుంది.
ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ,ఆహారాన్ని మోసుకెళ్తూ చీమ అప్పుడప్పుడు ఏనుగుకేసి చూసేది.
వారం రోజులైంది. ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది.
ఏనుగుకి ఎలాంటి అభ్యంతరమూ లేదనుకుని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమైంది. చీమ, చీమ భార్య , చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం
పెట్టాయి.
ఏనుగు చేవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది. నెల రోజులు దాటాయి.
చీమ భార్యకు ఇం కా ఆ చోటులోనే వుండాలనిపించలేదు. వెంటనే అది తన భర్తతో 'మరెక్కడికైనా వెళ్దాం...' అని చెప్పిం ది.
ఇం తకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏ మాత్రం నొప్పిం చక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి
చీమలు.
యజమాని చీమ, ఏనుగుతో ఎంతో సున్నితం గా ఇలా చెప్పిం ది....
"ఓయ్‌ ఏనుగూ....మేము మరో చోటికి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం. ఏ ఇబ్బం దీ పడలేదు. నీ చెవి పెద్దదిగా ఉండి మేము దర్జాగా ఉండటానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ, ఒక ఎద్దు కాళ్ళల్లో నివాసముంటున్న తన మిత్రులను కలవాలని నా భార్య ఆశపడుతోంది. నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ
ఉండదనుకుంటాను. అలా ఒకవేళ అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో చెప్పు."
వారం రోజులైంది. ఏనుగు మళ్ళీ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే తన చెవిలో చీమలు వున్న సం గతి ఆ ఏనుగుకి తెలిస్తేగా...
చీమ కుటుంబం ఏనుగు చెవిలోనుంచి బయటకు వచ్చేసి, తొండం మీదగా చేరి 'వెళ్లి వస్తామం టూ 'వీడ్కోలు పలుకుతుండాగా.. ఓ ఈగ వచ్చి చీమల ప్రక్కనే తొండం మీద వాలింది.. ఈగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది..
ఇం కేం , ఈగ గాలిలోకి ఎగిరిపోయింది.. చీమలు దగ్గరలో వున్న నదిలోకి ఎగిరి పడ్డాయి..
ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సిం ది ఏమిటంటే.... "నువ్వు వున్నావన్న విషయాన్ని అం దరూ గుర్తించాల్సిన పని లేదు. ఎవరి జీవతం వారిదీ. "


  • RSK Telugu stories
  • చిన్న చీమ- పెద్ద ఏనుగు నీతి కథ
  • చిన్న చీమ
  • పెద్ద ఏనుగు
  • నీతి కథ
  • ఏనుగు
  • కథ
  • telugu moral stories
  • fairy tales stories
  • stories for kids
  • Small Ant and Big Elephant
  • ant and elephant story
  • Ant and Elephant
  • kids funny stories in telugu
  • moral stories
  • elephant and ant story
  • fairy tales
  • kids stories
  • bedtime stories for kids
  • ant story
  • elephant story

No comments:

Post a Comment