Learn Kids rhymes with latest Rhymes Finger Family Wild Animals Names and Sounds Farm animals Names and Sounds Abcd and many more Rhymes. A good channel for your children to learn more rhymes
*************** చిన్న చీమ- పెద్ద ఏనుగు నీతి కథ..**********************
ఒక చీమ తన కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది.
ఆ చీమ ఏనుగు ముందు నిల్చుని పెద్దగా అరుస్తూ ..
" ఓయ్ ఏనుగూ .. నా మాట విను.. నేనూ, నా కుటుంబ సభ్యులం నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించు. నీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు..... ఆ అభ్యంతరాలు సరైనవో కావో మేము చర్చించుకుంటాం...సరేనా?" అం ది.
తను ఎదురాగా ఓ చీమ వుందనీ, అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ వుంది.
ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ,ఆహారాన్ని మోసుకెళ్తూ చీమ అప్పుడప్పుడు ఏనుగుకేసి చూసేది.
వారం రోజులైంది. ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది.
ఏనుగుకి ఎలాంటి అభ్యంతరమూ లేదనుకుని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమైంది. చీమ, చీమ భార్య , చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం
పెట్టాయి.
ఏనుగు చేవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది. నెల రోజులు దాటాయి.
చీమ భార్యకు ఇం కా ఆ చోటులోనే వుండాలనిపించలేదు. వెంటనే అది తన భర్తతో 'మరెక్కడికైనా వెళ్దాం...' అని చెప్పిం ది.
ఇం తకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏ మాత్రం నొప్పిం చక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి
చీమలు.
యజమాని చీమ, ఏనుగుతో ఎంతో సున్నితం గా ఇలా చెప్పిం ది....
"ఓయ్ ఏనుగూ....మేము మరో చోటికి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం. ఏ ఇబ్బం దీ పడలేదు. నీ చెవి పెద్దదిగా ఉండి మేము దర్జాగా ఉండటానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ, ఒక ఎద్దు కాళ్ళల్లో నివాసముంటున్న తన మిత్రులను కలవాలని నా భార్య ఆశపడుతోంది. నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ
ఉండదనుకుంటాను. అలా ఒకవేళ అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో చెప్పు."
వారం రోజులైంది. ఏనుగు మళ్ళీ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే తన చెవిలో చీమలు వున్న సం గతి ఆ ఏనుగుకి తెలిస్తేగా...
చీమ కుటుంబం ఏనుగు చెవిలోనుంచి బయటకు వచ్చేసి, తొండం మీదగా చేరి 'వెళ్లి వస్తామం టూ 'వీడ్కోలు పలుకుతుండాగా.. ఓ ఈగ వచ్చి చీమల ప్రక్కనే తొండం మీద వాలింది.. ఈగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది..
ఇం కేం , ఈగ గాలిలోకి ఎగిరిపోయింది.. చీమలు దగ్గరలో వున్న నదిలోకి ఎగిరి పడ్డాయి..
ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సిం ది ఏమిటంటే.... "నువ్వు వున్నావన్న విషయాన్ని అం దరూ గుర్తించాల్సిన పని లేదు. ఎవరి జీవతం వారిదీ. "
************ నక్కకు బుద్ది చెప్పిన కోడి *******************
గ్రాండ్ మదర్ వాయిస్ :
ఒకానొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సం తోషంగా జీవిస్తూ వుండేది. తల్లీ, పిల్లలూ అం తా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో వున్న పొదల దగ్గర సం చరించి, సాయింత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేవి..
వీటి కదలికలను గమనించిన ఓ నక్క "కోడి కూనలు భలేగా వున్నాయి.. వీటిని తింటే చాలా రుచిగా వుంటుంది.. అన్నీ ఒకేమారు కాకుండా రోజుకో దాని పని పట్టాలి... ఇం క నాకు చాలా రోజుల వరకూ ఆహారం కొరతే వుండదు.. " అనుకుని సం బరపడి , ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటు వేసి రోజుకో కోడిపిల్లను ఎత్తుకుపోయి తినేది..
మొదట ఇది గమనించని తల్లికోడి..ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడం తో పిల్లలను ఓ మారు లెక్కించ్చింది. అం దులో కొన్ని పిల్లలు కనిపించకపోవడం తో అయోమయంలో పడిపోయింది. .
" నా కూనలు కొన్ని కనిపించడం లేదు .. ఏమయ్యాయి...? .పోరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా..?! లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా..అయినా , నేను ఇం తకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను?! " అనుకుని విపరీతం గా బాధపడింది.
ఆ రోజం తా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటం టూ లేదు. ఎక్కడా వాటి జాడ కనిపించలేదు.
రాత్రి పడుకుంది కానీ, తల్లికోడికి విచారం తో నిద్రపట్టలేదు. సరిగ్గా అదే సమయంలో బిందె దొర్లిన అలికిడి అవడం తో అటుగా
చూసింది.. నక్క ఓ కోడిపిల్లని ఎత్తుకుపోతుండటం గమనించింది..
పాపం, అదిచూసిన తల్లికోడికి పట్టరాని కోపం, దుఃఖం ఒకేసారి కలిగాయి.. కానీ , తను నిస్స హాయురాలు..
ఆ జిత్తులమారి నక్కకి తగిన బుద్దిచెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రం తా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి, ఓ నిర్ణయానికి వచ్చింది..
తెల్లారగానే, చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సం పాదించింది.. దాన్ని ఓ బిందెలో వుంచింది.
ఎప్పటిలానే నక్క ఆ రాత్రికూడా వచ్చింది.. దానికి ముందుగా ఘమఘమల వాసన రావడం తో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు
చూసింది. బిందెలో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది..
" ఆహా! ఇవాళేదో నా పంట పండినట్టుంది.. ముందు చాలా రుచికరమైన దీన్ని తింటానూ, తర్వాత ఓ కోడి పిల్లను ఎత్తుకు పోయి రేపు అల్పాహారం గా తింటాను.." అనుకుంటూ చాలా సం బరపడి.. తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది..
కానీ , నక్క దురదృష్టం కొద్దీ దాని తల అం దులోకి దూరదు.. అం దులో వున్న మాంసం నోటికీ అం దదు..
" ఎందుకిలా అయిందీ...! నేను ఈ మాంసాన్ని విడిచిపెట్టే ప్రశక్తే లేదు... ఎలాగైనా సాధించి తీరుతాను.. " అని బిందెలోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది.
ఇదం తా చాటుగా తల్లీ, పిల్లకోడులు చూస్తుంటాయి.
ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క, తర్వాత తల బైటకు రాక నానా తం టాలు పడింది..
కొద్ది రోజులలోనే ఆహారం తినడానికీ, నీళ్ళు తాగడానికీ లేక నక్క చనిపోయింది.
తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సం తోషంగా గడిపింది...
అం దుకే పెద్దలు చెబుతారు.. " ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారనీ.. "
************* సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క..******************
గ్రాండ్ మదర్ వాయిస్ :
ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సం చరిస్తూ వుండగా దానికి చచ్చిపోయి పడిఉన్న ఒక ఏనుగు కళేబరం
కనిపించింది.
ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చడానికి ప్రయత్నించింది. కానీ ఎంతో మం దం గా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు.
" ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది, మరో వైపు ఎదురుగా ఆహారం ఉన్నా తినలేని పరిస్థితి నాది. ఏం చేయలో అర్దం
కావడం లేదు.. నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదుకాదా.. " అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది. ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా, వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది.
సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వ కంగా వంగి ‘ఓ అడవిరాజా! ఇటువైపు వెళుతుండగా కనిపించిన ఈ మృ త ఏనుగు శరీరాన్ని ఎవరూ తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను’ అం ది.
నక్క మాటలకి ‘చాలా సం తోషం, కానీ నేను స్వ యంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారం గా
తీసుకోను. కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలివేస్తున్నాను’ అని అక్కడినుండి వెళ్ళిపోయింది సింహం.
కొంతసేపటికి అటుగా ఒక చిరుత పులి వచ్చింది.
‘సింహం కొన్ని నియమాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం ఒలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను. కానీ, ఈ చిరుత పులికి బొత్తిగా అటువంటివేమీ ఉండవు. దీని బారినుంచి నా ఆహారాన్ని కాపాడుకోవడమెలా?’ అనుకుంది నక్క.
దగ్గరకి వచ్చిన చిరుత పులిని చూసి నక్క కొంచం పొగరుగా ‘అయ్యో! చిరుత మామా! ఏమిటి ఇలా సరాసరి మృత్యుముఖంలోకి వచ్చావు ? ఈ ఏనుగును ఇప్పుడే సింహం చంపి, స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది. నన్ను దీనికి కాపలా పెట్టి వెళుతూ..
జాగ్రత్త, దీనిని తినడానికి ఒకవేళ చిరుతపులిగానీ వస్తుందేమో గమనించి నాకు చెప్పు.. నాకు చిరుతల పైన చాలా కోపంగా ఉంది.
ఈ అడవిలోని చిరుతలన్నిటినీ సమూలంగా నాశనం చేసేయాలని ప్రతిజ్ఞ పట్టాను అని హెచ్చరించి వెళ్ళింది.‘ అం ది.
నక్క మాటలకి భయపడిన చిరుత ‘ నా ప్రాణాలు కాపాడు. దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకే’ అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది.
చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది.
‘ఈ పులికి పెద్దకోరల్లాంటి పళ్ళు ఉన్నాయి. దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తాను’ అనుకుని ‘ఓ పులి మిత్రమా, చాలా కాలానికి కనిపించావే? అదేమిటీ అలా ఉన్నావు? నిన్ను చూస్తే ఎన్నాళ్ళనుంచో ఆహారం తిననట్లున్నావు? రా ఇక్కడికి. ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరగించు. ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది. అది వచ్చేలోగా నువ్వు గబగబా నీకు కావల్సినం త తిని వెళ్ళిపో’ అం ది నక్క.
‘అమ్మో, అలాగయితే నాకీ ఆహారం వద్దే వద్దు. సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది’ అం ది పులి భయంగా.
‘మరీ పిరికిదానిలా మాట్లాడకు. భయపడకుండా నీక్కావలసినం త తిను. నేను చూస్తుంటాను. సింహం అం త దూరం లో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే. అప్పుడు వెళిపోదువుగాని సరేనా?’
నక్క జిత్తులమారి మాటలకి మోసపోయిన పెద్ద పులి, ఏనుగు శరీరాన్ని తన గోళ్ళతో చీల్చి కొంచెం తిన్న దో లేదో అం తలోనే ‘అదుగో సింహం వచ్చేస్తోంది. పరిగెత్తి పారిపో... పారిపో’ అని అరిచింది నక్క.
తింటున్న దల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుధ్ధి చెప్పి అక్కడనుంచి పారిపోయింది పులి.
అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులనూ బోల్తాకొట్టించి తన పని జరిపించుకుని , ఆ తరువాత చాలా రోజులవరకూ కూడ ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క .
ఈ కథలో నీతి ఏమిటంటే.. "సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు."